మల్కాజిగిరి జోనల్ పరిధిలో అడిషనల్ కమిషనర్ టి. వినయ్ కృష్ణ రెడ్డి పర్యటన

మల్కాజిగిరి జోనల్ పరిధిలో అడిషనల్ కమిషనర్ టి. వినయ్ కృష్ణ రెడ్డి పర్యటన

మల్కాజిగిరి, జనవరి 09 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజిగిరి జోనల్ పరిధిలో అడిషనల్ కమిషనర్ టి. వినయ్ కృష్ణ రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఏ.ఓ.సి నుంచి ఆర్.కె.పురం వరకు ఉన్న ప్రధాన రహదారులు,  (ఆర్ యు బి) మరియు ( ఆర్‌ఓబీ )లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.ప్రధాన రహదారుల స్థితిగతులు, ట్రాఫిక్ సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.అనంతరం మల్కాజిగిరి జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ టి. వినయ్ కృష్ణ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల సమస్యలపై అధికారులు అప్రమత్తంగా ఉండి వెంటనే స్పందించాలని, సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ ఐఏఎస్, డిప్యూటీ కమిషనర్ జకీయా సుల్తానా, ఉప కమిషనర్ గోపాల్ రావు, సిటీ ప్లానర్ శ్రీనివాస్, సంగీతతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.IMG-20260109-WA0057

Tags:

Post Your Comments

Comments

Latest News

కుషాయిగూడలో రోడ్డు ప్రమాదం చికిత్స పొందుతూ యువకుడు మృతి కుషాయిగూడలో రోడ్డు ప్రమాదం చికిత్స పొందుతూ యువకుడు మృతి
కుషాయిగూడ , జనవరి 09 (తెలంగాణ ముచ్చట్లు): మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు చికిత్స...
అనునిత్యం ప్రజా శ్రేయస్సే మా ధ్యేయం  నెమలి అనిల్ కుమార్
మర్లపాడు వద్ద రోడ్డు ప్రమాదం.
ప్రజా సమస్యల పరిష్కారమే మా ధ్యేయం : మంత్రి పొంగులేటి
అనారోగ్యంతో బాధపడుతున్న  వ్యక్తికి రూ.2 లక్షల ఎల్ఓసి మంజూరు
మల్కాజిగిరి జోనల్ పరిధిలో అడిషనల్ కమిషనర్ టి. వినయ్ కృష్ణ రెడ్డి పర్యటన
రోడ్డు భద్రతపై కీసర పోలీసుల అవగాహన కార్యక్రమం