స్మార్ట్ కిడ్జ్ లో  అంబరాన్నంటిన సంక్రాంతి సంబురాలు.

స్మార్ట్ కిడ్జ్ లో  అంబరాన్నంటిన సంక్రాంతి సంబురాలు.

---పాఠశాల ప్రాంగణాల నిండా ముగ్గుల తోరణాలు. 
 - - ఆకట్టుకున్న బొమ్మల కొలువు

---భోగి మంటలు, తెలుగింటి పిండి వంటలు, సాంప్రదాయ దుస్తులతో  సందడే సందడి.

---గాలిపటాలు, చెరుకు గడలు, డు డూ బసవన్నలతో హుషారు. 

ఖమ్మం బ్యూరో, జనవరి 10(తెలంగాణ ముచ్చట్లు)

స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో శనివారం ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. భోగి, సంక్రాంతి, కనుమ సంబురాలు పాఠశాలలో హోరెత్తాయి. పాఠశాల ప్రాంగణాల నిండా ముగ్గుల తోరణాలు కనువిందు చేశాయి. విద్యార్థులు  భోగి మంటలు వేసి సందడి చేయగా చిన్నారులకు భోగిపండ్ల వేడుక సాంప్రదాయ సిద్ధంగా నిర్వహించారు. బొమ్మల కొలువుతో చిన్నారులు హుషారుగా గడిపారు. హరిదాసులు, డు డూ బసవన్నలతో అలరించారు. సాంప్రదాయ తెలుగింటి పిండి వంటలు తయారుచేసి అందరికీ పంచి ఆత్మీయ ఆనందాన్ని కలుగజేశారు. చీరకట్టు, పంచ కట్టులతో చిన్నారులు సాంప్రదాయ దుస్తుల్లో కలియ తిరుగుతూ హుషారుగా గడిపారు. పంట పొలాలలో రైతన్నలు నిర్వహిస్తున్న  ప్రక్రియల సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చెరుకు గడలు, మామిడి తోరణాలతో పాఠశాల ఆవరణమంతా అలంకరించి సంక్రాంతి సంబురాలను  నయనానందకరంగా  నిర్వహించారు. తెలుగు జానపద గేయాలకు విద్యార్థులు వేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. గాలిపటాలు ఎగరవేస్తూ విద్యార్థులు ఉత్సాహంగా గడిపారు. మూడు రోజుల పెద్ద పండుగ సంక్రాంతి వేడుకలతో విద్యార్థులు మురిసిపోయారు. విద్యార్థుల తల్లులకు,
మహిళా ఉపాధ్యాయులకు నిర్వహించిన ముగ్గుల పోటీలలో మహిళలు పలు సామాజిక అంశాలపై వేసిన రంగవల్లులు ఆలోచింపచేసాయి.
 ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సంబురాలను మూడు రోజులపాటు 
 నిర్వహించుకుంటున్నా 
ముమన్నారు. భోగి మంటలు అందరి జీవితాలలో నూతన ఉషస్సులను నింపుతున్నాయని , సంక్రాంతి సంబురాలు తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తున్నాయి అన్నారు ‌. కనుమ పర్వదిన వేడుకలు అన్నదాతల జీవన నేస్తాల స్వాంతనను దశదిశలా చాటి చెప్పుతున్నాయని పేర్కొన్నారు. మూడు రోజులపాటు నిర్వహించే ఏకైక పర్వదినం సంక్రాంతి అందరి జీవితాలలో కొత్త వెలుగులు నింపుతున్నదని ప్రకృతి పరంగా కాలగమనం దక్షణాయనం నుంచి ఉత్తరాయణం వరకు ప్రయాణిస్తూ సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించి నూతన కాంతులను అందించే ప్రస్థానం  నవ ఉషస్సులను నింపుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పుసుకన్య, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. IMG-20260110-WA0060

Tags:

Post Your Comments

Comments

Latest News

ఏకశిలా నగర్ భూవివాదంపై ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు ఏకశిలా నగర్ భూవివాదంపై ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు
ల్యాండ్ మాఫియా–అధికారుల కుమ్మక్కు తక్షణమే ఆపాలి 24 గంటల్లో అరెస్టులు లేకపోతే ఉద్యమం ఉధృతం మేడ్చల్–మల్కాజ్గిరి , జనవరి 11 (తెలంగాణ ముచ్చట్లు)  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా...
రఘు నాథపాలెం మండలం వర ప్రదాయిని  మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్
జర్న‌లిస్టుల‌కు ప్రభుత్వం అండగా ఉంటుంది
కొండా గోపి పుట్టినరోజు సందర్భంగా నాగులవంచలో రక్తదాన శిబిరం..
శ్రీ గ్లోబల్ హై స్కూల్ నాగులవంచలో ఘనంగా సంక్రాంతి సంబరాలు..
పాత్రికేయ విలువలకు నిలువెత్తు ప్రతీక  టీ.కే. లక్ష్మణ రావు
మీ నమ్మకాన్ని వొమ్ము చేయడం లేదు