సత్తుపల్లి ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడిగా తీగల క్రాంతి కుమార్.
ఉత్తర్వులు జారీ చేసిన సంజీవరెడ్డి, జనక్ ప్రసాద్.
సత్తుపల్లి, డిసెంబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు):
సింగరేణి సంస్థలో నూతనంగా ఏర్పడిన సత్తుపల్లి ఏరియాకు ఐఎన్టీయూసీ ఏరియా ఉపాధ్యక్షుడిగా తీగల క్రాంతి కుమార్‌ను నియమిస్తూ ఐఎన్టీయూసీ ఆల్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ సంజీవరెడ్డి, సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్‌లకు సన్నిహితుడిగా ఉన్న తీగల క్రాంతి కుమార్ యూనియన్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ, కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ కార్మికుల మన్ననలు పొందారు. యూనియన్ బలోపేతానికి చేసిన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు ఐఎన్టీయూసీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నియామకంపై సత్తుపల్లి సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసే నాయకులను గుర్తించి పదవులు కేటాయించడం పట్ల ఐఎన్టీయూసీ అధినాయకత్వంపై వారు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా తీగల క్రాంతి కుమార్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ఐఎన్టీయూసీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, కార్మికుల హక్కుల పరిరక్షణకు ముందుండి పోరాడతానని ఆయన పేర్కొన్నారు.


Comments