ప్రాణాలకు అపాయంగా మారిన కోనోకార్పస్ చెట్ల తొలగింపు

మల్లాపూర్‌లో అర్బన్ బయోడైవర్సిటీ అధికారుల చర్య

ప్రాణాలకు అపాయంగా మారిన కోనోకార్పస్ చెట్ల తొలగింపు

మల్లాపూర్, డిసెంబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):

మల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో ప్రజల ప్రాణాలకు ప్రమాదంగా మారిన కోనోకార్పస్ చెట్లను తొలగించాలని గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ కోరారు. శక్తి సాయి నగర్ డివిజన్ పరిధిలోని శక్తి సాయి నగర్ కాలనీ పార్క్‌లో గత ప్రభుత్వం పార్క్ సుందరీకరణ పేరుతో నాటిన కోనోకార్పస్ చెట్ల వల్ల కాలనీ వాసులు శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు.శక్తి సాయి నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జెస్సి, ప్రధాన కార్యదర్శి సుధాకర్‌తో పాటు స్థానికులు చేసిన ఫిర్యాదుల మేరకు నెమలి అనిల్ కుమార్ అర్బన్ బయోడైవర్సిటీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అధికారులు పార్క్‌లోని ప్రాణాంతకమైన కోనోకార్పస్ చెట్లను తొలగించారు.ఈ సందర్భంగా నెమలి అనిల్ కుమార్ మాట్లాడుతూ, కోనోకార్పస్ చెట్లు పర్యావరణానికి తీవ్రంగా హానికరమని, ఇవి శ్వాసకోశ సమస్యలకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ చెట్లు డ్రైనేజీ వ్యవస్థలు, మంచినీటి పైపులైన్లు, విద్యుత్ కేబుల్స్‌కు తీవ్ర నష్టం కలిగిస్తూ ప్రభుత్వానికి లక్షల్లో ఆర్థిక నష్టం కలిగిస్తున్నాయని తెలిపారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో అధికంగా కోనోకార్పస్ చెట్లనే వినియోగించడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి హానికరమైన చెట్లను తొలగించి, ఉపయోగకరమైన మొక్కలను నాటాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి వి. శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కె. రాజేష్, రాకేష్, యాసీన్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.IMG-20251230-WA0268

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .