నాచారం వాసవి సేవా సమితి 10వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహణ

నాచారం వాసవి సేవా సమితి 10వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహణ

నాచారం,డిసెంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):

సమాజ సేవలో తమ వంతు బాధ్యతగా సేవలందించాలనే సంకల్పంతో ఏర్పాటైన శ్రీ వాసవి సేవా సమితి పదేళ్లుగా అనేక సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తోందని నిర్వాహకులు తెలిపారు. నాచారం వాసవి సేవా సమితి 10వ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.2016 సంవత్సరంలో కేవలం 17 మంది సభ్యులతో ప్రారంభమైన వాసవి సేవా సమితి నేడు వంద మందికి పైగా సభ్యులతో విస్తరించడంపై నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలుగా నిరంతరంగా సేవా కార్యక్రమాలు చేపడుతూ, కరోనా కష్టకాలంలో పేద ప్రజలకు ఆహార ధాన్యాలు పంపిణీ చేసి ఆదుకున్నారు.ప్రతి అమావాస్య రోజున నాచారం మహంకాళి దేవాలయం వద్ద సుమారు 1200 మందికి అన్నదానం నిర్వహిస్తున్నామని సమితి నిర్వాహకులు వెల్లడించారు. ఈ సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు.ఈ సందర్భంగా వాసవి సేవా సమితి నిర్వాహకుడు శ్రీరామ్ సత్యనారాయణను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. సమాజానికి సేవ చేయడమే లక్ష్యంగా వాసవి సేవా సమితి ముందుకు సాగుతుందని సభ్యులు పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .