నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే మేఘారెడ్డి
పెద్దమందడి,డిసెంబర్29(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండల కేంద్రానికి చెందిన కొమ్ము నాగమ్మ (75) అనే వృద్ధురాలు ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మానవత్వంతో స్పందించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తక్షణ సహాయంగా రూ.5,000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని సర్పంచ్ మరియు పార్టీ నాయకుల ద్వారా అందజేశారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేద కుటుంబాలను ఆదుకోవడం తమ బాధ్యతగా భావిస్తామని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందే ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు సైతం అందేలా అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సూర్య గంగా రవి, మాజీ జడ్పిటిసి వెంకటస్వామి, 6వ వార్డ్ మెంబర్ కొమ్ము సత్యనారాయణ, టిఎంఆర్ నాయకులు గట్టు రాజశేఖర్, ఎస్. శివకుమార్, ఆర్. నాగరాజు, ఎస్. కురుమూర్తితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.తమ కష్టకాలంలో ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచిన ఎమ్మెల్యే మేఘారెడ్డికి నాగమ్మ కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


Comments