జయగిరిలో సంక్రాంతి సంబరాలు.
Views: 21
On
హాసన్ పర్తి, జనవరి 11(తెలంగాణ ముచ్చట్లు):
హసన్ పర్తి మండలంలోని జయగిరిగ్రామంలో సర్పంచ్ వెంకటేశ్వర్లు,ఉప సర్పంచ్ భూక్య అరుణ్,గ్రామ పాలక మండలి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు సోమవారం ఘనంగా నిర్వహించారు.సంక్రాంతి వేడుకలు సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు.ఈ పోటీలో సుమారు 30 మంది మహిళలు పాల్గొని ముగ్గులు వేశారు.ఈ కార్యక్రమానికి న్యాయ నిర్నేతలుగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి,అధ్యాపకులు జయశీల పార్వతి,రమిత హాజరై మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి ప్రతిభ గల ముగ్గురిని ఎంపిక చేశారు. మొదటి బహుమతి బొజ్జ సంధ్యారాణి,రెండో బహుమతి పిట్టల సునీత,మూడో బహుమతి జనగాని సాత్విక ఎంపికయ్యారు.అనంతరం గెలుపొందిన మహిళలను గ్రామ ప్రజలు,గ్రామ పాలకమండలి సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామ పాలకమండలి సభ్యులు ,మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
11 Jan 2026 21:51:21
జాతీయస్థాయి సీనియర్ కోకో పోటీలను ప్రారంభిస్తున్న మంత్రులు అనంతరం మాట్లాడుతున్న ఉత్తంకుమార్ రెడ్డి
ముఖ్య అతిధులు గా హాజరైన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,...


Comments