సత్తుపల్లిలో లయన్స్ హంగర్ సర్వీస్ ముగింపు.

సహకారానికి సన్మానం 792 రోజులకు చేరిన వీల్స్ ఆన్ మీల్స్.

సత్తుపల్లిలో లయన్స్ హంగర్ సర్వీస్ ముగింపు.

సత్తుపల్లి, జనవరి 11 (తెలంగాణ ముచ్చట్లు):

పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా “సమాజం నుంచి ఎంతో పొందాం… సమాజానికి తిరిగి ఇవ్వాలి” అనే నినాదంతో సత్తుపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హంగర్ సర్వీస్ వారోత్సవం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు గోగడ రవి అధ్యక్షతన స్థానిక ప్రభుత్వాస్పత్రి వద్ద ముగింపు కార్యక్రమం నిర్వహించారు. వారం రోజుల పాటు చేపట్టిన హంగర్ సర్వీస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన సత్తుపల్లి డివిజన్ ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షులు పసుపులేటి నాగేశ్వరరావుతో పాటు పట్టణానికి చెందిన రాంబాబు, మిద్దె శ్రీను, రహ్మద్ పాషా, వాహిద్, సన్నీలను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించారు.
వృద్ధులు, యాచకులు, పేదలకు ఉదయం వేళ అల్పాహారం అందించేందుకు చేపట్టిన వీల్స్ ఆన్ మీల్స్ కార్యక్రమం ఆదివారం నాటికి 792 రోజులకు చేరింది. స్థానిక ప్రభుత్వాస్పత్రి, బస్టాండ్ సెంటర్ ప్రాంతాల్లో గత 792 రోజులుగా ఎటువంటి అంతరాయం లేకుండా అల్పాహారం అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సేవలకు లయన్స్ క్లబ్ సభ్యులతో పాటు పట్టణంలోని దాతలు సహకరిస్తున్నారు.
ప్రజాసేవలో సత్తుపల్లి లయన్స్ క్లబ్ రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిందని క్లబ్ నిర్వాహకులు తెలిపారు. ఉచిత అంబులెన్స్ సేవలు, నేత్రదానం, ఆరోగ్య శిబిరాలు తదితర సేవలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మందపాటి ప్రభాకరరెడ్డి, దారా కృష్ణారావు, గండ్ర సోమిరెడ్డి, కొత్తూరు ప్రభాకర్ రావు, పెనుగొండ రమేష్, వెల్ది జగన్ మోహన్ రావు, రమణ, సలీం, గార్లపాటి సత్యనారాయణ, కేశవరావు, చల్లగుండ్ల అప్పారావు, మందపాటి చెన్నారెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.IMG-20260111-WA0165

Tags:

Post Your Comments

Comments

Latest News

కాజీపేట్ లో అట్టహాసంగా 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు ప్రారంభం కాజీపేట్ లో అట్టహాసంగా 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు ప్రారంభం
జాతీయస్థాయి సీనియర్ కోకో పోటీలను ప్రారంభిస్తున్న మంత్రులు అనంతరం మాట్లాడుతున్న ఉత్తంకుమార్ రెడ్డి ముఖ్య అతిధులు గా హాజరైన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,...
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
మృతుని కుటుంబానికి మేఘన్న ఆర్థిక చేయూత
షైన్ హై స్కూల్ సంక్రాంతి సంబరాలు...
సంక్రాంతి సందర్భంగా  ముగ్గుల పోటీలు
కందుకూరులో మంత్రి తుమ్మల పర్యటన.!
ముమ్మర ప్రచారం భారీ ఏర్పాట్లు