కందుకూరులో ఎమ్మెల్యే మట్టా రాగమయి పర్యటన.

96వ పుట్టినరోజు సందర్భంగా బండి శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు.

కందుకూరులో ఎమ్మెల్యే మట్టా రాగమయి పర్యటన.

సత్తుపల్లి, జనవరి 11 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో ఆదివారం సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు మట్టా రాగమయి పర్యటించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు బండి పార్ధసారధి రెడ్డి తండ్రి, గ్రామ పెద్దలు బండి శ్రీనివాస్ రెడ్డి 96వ పుట్టినరోజు సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం కందుకూరు గ్రామంలోని డీసీసీబీ బ్యాంకును ఎమ్మెల్యే సందర్శించి సొసైటీ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. బ్యాంకు ద్వారా రైతులకు అందుతున్న రుణాలు, సేవలపై ఆరా తీశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలు మరింత సమర్థవంతంగా అందించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి, వేంసూరు కాంIMG-20260111-WA0162గ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్లు, డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కాజీపేట్ లో అట్టహాసంగా 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు ప్రారంభం కాజీపేట్ లో అట్టహాసంగా 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు ప్రారంభం
జాతీయస్థాయి సీనియర్ కోకో పోటీలను ప్రారంభిస్తున్న మంత్రులు అనంతరం మాట్లాడుతున్న ఉత్తంకుమార్ రెడ్డి ముఖ్య అతిధులు గా హాజరైన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,...
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
మృతుని కుటుంబానికి మేఘన్న ఆర్థిక చేయూత
షైన్ హై స్కూల్ సంక్రాంతి సంబరాలు...
సంక్రాంతి సందర్భంగా  ముగ్గుల పోటీలు
కందుకూరులో మంత్రి తుమ్మల పర్యటన.!
ముమ్మర ప్రచారం భారీ ఏర్పాట్లు