పుట్టినరోజు వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే
పెద్దమందడి,జనవరి11(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం అల్వాల గ్రామానికి చెందిన హేమ వర్ధన్ రెడ్డి–అనూష దంపతుల కుమారుడు విహాన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పిల్లల జీవితాల్లో కొన్ని రోజులు మరుపురానివిగా నిలిచిపోతాయని, అటువంటి ప్రత్యేక సందర్భాలను ఈ విధంగా కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో జరుపుకోవడం భవిష్యత్తులో మధుర జ్ఞాపకాలుగా మిగులుతాయని అన్నారు. పుట్టినరోజు వేడుకలను అర్థవంతంగా నిర్వహించిన తల్లిదండ్రులను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, వనపర్తి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి. కృష్ణ, అల్వాల గ్రామ నాయకులు సుదర్శన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, గట్టు యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments