పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది

డా. జిల్లెల చిన్నారెడ్డి

పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది

వనపర్తి,జనవరి11(తెలంగాణ ముచ్చట్లు):

పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి స్పష్టం చేశారు.ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలు పొందిన పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) కింద 86 చెక్కులను, మొత్తం రూ.21,45,000 విలువైన నిధులను ఆయన లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా డా. జిల్లెల చిన్నారెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని, అయితే  రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క క్రమశిక్షణతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి పేద ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రికార్డు స్థాయిలో సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తున్నామని పేర్కొన్నారు.పేదలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని, ఆరోగ్యశ్రీ వర్తించని వారికి చికిత్స అనంతరం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక ఉపశమనం కల్పిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా పేద ప్రజలను గుర్తించి వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డా. జిల్లెల చిన్నారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, వనపర్తి జిల్లా ఏఐపీసీ అధ్యక్షులు నాగార్జున, జిల్లా సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ చంద్రశేఖర్, వనపర్తి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాములు యాదవ్, పట్టణ ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ బాబా, పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సి. పెంటన్న యాదవ్, అసెంబ్లీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గడ్డం వినోద్, వనపర్తి మండల ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు ఎత్తం చరణ్ రాజ్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇర్ఫాన్, పెద్దమందడి ఎన్‌ఎస్‌యూఐ నాయకులు వెంకటేష్ సాగర్, పెద్దగూడెం మాజీ సర్పంచ్ జానకమ్మ, మెంటేపల్లి సర్పంచ్ రాములు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోళ్ల వెంకటేష్, సహదేవుడు, అబ్దుల్లా, జానంపేట నాగరాజ్, రాంబాబు, ఎంట్ల రవి, కృపాకర్ రెడ్డి, శ్రీనివాసులు, రమేష్, శ్రీధర్ రెడ్డి, గోవర్ధన్, బాల్రాజ్, చెన్నయ్య, పెద్దమందడి సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కాజీపేట్ లో అట్టహాసంగా 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు ప్రారంభం కాజీపేట్ లో అట్టహాసంగా 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు ప్రారంభం
జాతీయస్థాయి సీనియర్ కోకో పోటీలను ప్రారంభిస్తున్న మంత్రులు అనంతరం మాట్లాడుతున్న ఉత్తంకుమార్ రెడ్డి ముఖ్య అతిధులు గా హాజరైన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,...
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
మృతుని కుటుంబానికి మేఘన్న ఆర్థిక చేయూత
షైన్ హై స్కూల్ సంక్రాంతి సంబరాలు...
సంక్రాంతి సందర్భంగా  ముగ్గుల పోటీలు
కందుకూరులో మంత్రి తుమ్మల పర్యటన.!
ముమ్మర ప్రచారం భారీ ఏర్పాట్లు