పెద్దమందడి నూతన ఎస్సై జలంధర్ రెడ్డికి ఘన స్వాగతం
పెద్దమందడి,జనవరి10(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సబ్ ఇన్‌స్పెక్టర్ జలందర్ రెడ్డిని మండల ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సై జలంధర్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. పెద్దమందడి మండలంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా, ప్రజలకు పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకం కలిగేలా సేవలు అందించాలని కోరారు.మండల ప్రజల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ, అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.దీనికి స్పందించిన ఎస్సై జలంధర్ రెడ్డి ప్రజల సహకారంతో మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎలాంటి సడలింపులు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు ఐ. సత్య రెడ్డి, స్థానిక సర్పంచ్ సూర్య గంగ రవి, మాజీ జడ్పీటీసీ కొమ్ము వెంకటస్వామి, వార్డ్ మెంబర్లు వాకిటి రమేష్, తన్వీర్ అహ్మద్, ముఖ్య నాయకులు ఎస్. రాఘవేంద్ర, నందిమల్ల త్రినాథ్, గట్టు రాజశేఖర్‌తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొని నూతన ఎస్సైకి ఘన స్వాగతం పలికారు.


Comments