చిల్కానగర్ డివిజన్‌లో సీసీ రోడ్డు పనులను పర్యవేక్షించిన
కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్
చిల్కానగర్, డిసెంబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని చిల్కానగర్ డివిజన్‌లో సుమారు రూ.40 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ బుధవారం పరిశీలించారు.న్యూ రాంనగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి అంబేద్కర్ విగ్రహం వెనుక భాగం నుండి తెలంగాణ తల్లి విగ్రహం మీదుగా డాక్టర్ అశోక్ క్లినిక్ వరకు చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనుల పురోగతిని ఆమె పర్యవేక్షించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ, సీసీ రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. పనుల సమయంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. అలాగే నిర్మాణం వల్ల కాలనీవాసులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, డ్యామేజ్ అయిన మంచినీటి పైప్‌లైన్లు, సివరేజ్ పైప్‌లైన్లను వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. రోడ్డు నిర్మాణంలో జాప్యం జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ సాయి కిరణ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ కేదార్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, సీనియర్ నాయకులు ఎద్దుల కొండల్ కోకొండ, కోకొండ జగన్, మాస శేఖర్, ప్రతాప్ రెడ్డి, యాదగిరి పోచయ్య, హరీష్ రావు, తాహిర్, ప్రవీణ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.


Comments