ఎంజీఎన్ఆర్ఈజిఎ నుంచి గాంధీ పేరు తొలగింపు ప్రజావ్యతిరేక చర్య

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్‌లో నిరసన

ఎంజీఎన్ఆర్ఈజిఎ నుంచి గాంధీ పేరు తొలగింపు ప్రజావ్యతిరేక చర్య

మేడ్చల్, డిసెంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):

దేశ ప్రజల హక్కైన జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజిఎ) నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏఐసీసీ పిలుపు మేరకు, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ గౌడ్ ఆదేశాల ప్రకారం మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ నేతృత్వంలో మేడ్చల్ ఎంఆర్వో కార్యాలయం పక్కన ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఈ నిరసన జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ,
“ఎంజీఎన్ఆర్ఈజిఎ నుంచి గాంధీ పేరు తొలగించడం అంటే దేశ ప్రజల మనసుల్లో నుంచి గాంధీ సిద్ధాంతాలను చెరిపివేయాలనే కుట్ర. కోట్లాది పేదలకు ఉపాధి, ఆర్థిక భరోసా ఇచ్చే ఈ పథకాన్ని నిధుల కోతలతో బలహీనపరచి, చివరకు గాంధీ పేరును తొలగించడం బీజేపీ ప్రభుత్వ అసలు స్వరూపాన్ని వెల్లడిస్తోంది” అని విమర్శించారు.దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, ప్రజావ్యతిరేక నిర్ణయాలు వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ నిరసనలో జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, కోలన్ హనుమంత్ రెడ్డి, నర్స రెడ్డి, బూపతి రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త అంజి రెడ్డి, సీతారామ్ రెడ్డి, పత్తి కుమార్, మల్లాపూర్ డివిజన్ అధ్యక్షుడు కపర సాయి గౌడ్, ఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షుడు కేశెట్టి ప్రసాద్, రామంతపూర్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లపు శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.అలాగే ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, సీనియర్ నాయకువందలాది కాంగ్రెస్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.IMG-20251221-WA0073

Tags:

Post Your Comments

Comments

Latest News

మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో నూతన వార్డు సభ్యులకు ఘన సన్మానం మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో నూతన వార్డు సభ్యులకు ఘన సన్మానం
అడ్డాకల్,జనవరి5(తెలంగాణ ముచ్చట్లు): మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో సోమవారం మహబూబ్నగర్ జిల్లా  అడ్డకల్ మండల కేంద్రంలో మహిళా సమైక్య కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల...
బీసీ భవన నిర్మాణానికి అనుమతి.!
గురుకులాల బలోపేతానికి రూ.10.65 కోట్లు మంజూరు
అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన మణిగిల్ల సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్
ఓణీల–పంచకట్టు వేడుకల్లో చిన్నారులను ఆశీర్వదించిన సోయం వీరభద్రం.
కేటీఆర్ ఖమ్మం పర్యటనను విజయవంతం చేయాలి.
భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం