ఉప్పల్ నియోజకవర్గంలో పాస్టర్లకు క్రిస్మస్ కానుకలు

ఉప్పల్ నియోజకవర్గంలో పాస్టర్లకు క్రిస్మస్ కానుకలు

ఉప్పల్, డిసెంబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు):

ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి పాస్టర్‌కు బట్టలు పంపిణీ చేయడం ఉప్పల్ నియోజకవర్గ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి అనుసరిస్తున్న సంప్రదాయంగా మారింది.ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నియోజకవర్గంలోని సుమారు 400 మంది పాస్టర్లకు బట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఉప్పల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించబడింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, అన్ని మతాల పండుగలను సమానంగా గౌరవిస్తూ ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాస్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .