మండల గ్రామ పంచాయతీ ఫోరం కమిటీ నియామకం.
Views: 13
On
హసన్ పర్తి డిసెంబర్ 31(తెలంగాణ ముచ్చట్లు):
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు హసన్ పర్తి మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి,ఆత్మకూర్ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ తంగె ళ్ళపల్లి తిరుపతి ఆధ్వర్యంలో మండలంలోని15 గ్రామ పంచాయతీల సర్పంచులు కలిసి హసన్ పర్తి సర్పంచ్ ఫోరo కమిటీని నియమించారు.ఈ నియామకంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా చల్లా రాకేష్ రెడ్డి (గుంటూరుపల్లి),ఉపాధ్యక్షుడిగా అంబాల ప్రభాకర్ గౌడ్ (అర్వపల్లి),కార్యదర్శిగా రామంచ వెన్నెల ( అనంతసాగర్) లను ఎన్నుకున్నారు. ఈ నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే నాగరాజుకు సర్పంచులు కృతజ్ఞత తెలియజేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments