నూతన డిప్యూటీ కమిషనర్‌కు శాలువాతో సన్మానం కాంగ్రెస్ నాయకులు
Views: 20
On
కాప్రా, డిసెంబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన కె. శ్రీహరిను కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి సూచన మేరకు, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్ నాయక్, కాప్రా డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కొబ్బనూరి నాగశేషు కలిసి డిప్యూటీ కమిషనర్‌ను కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సన్మానించి, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పూర్ణయాదవ్, కాప్రా డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు తన్నీరు శ్రీహరి, సంతోష్ చారి, జగదీష్, షాబుద్దీన్, రిజ్వాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments