మోజర్లలో బిఆర్ఎస్ ఏకైక వార్డు సభ్యుడిగా గట్టు సతీష్ ప్రమాణ స్వీకారం

మోజర్లలో బిఆర్ఎస్ ఏకైక వార్డు సభ్యుడిగా గట్టు సతీష్ ప్రమాణ స్వీకారం

పెద్దమందడి,డిసెంబర్29(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుంచి ఏకైక వార్డు సభ్యుడిగా గట్టు సతీష్ విజయం సాధించారు. మొత్తం 10 వార్డులకు గాను 9 వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా, ఒక్క వార్డును బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం విశేషం.నూతనంగా ఎన్నికైన సందర్భంగా గట్టు సతీష్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. పంచాయతీ కార్యదర్శి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మోజర్ల గ్రామ మాజీ సర్పంచ్ సునీత తిరుపతయ్య, బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నరసింహారెడ్డి, అధికారులు గట్టు సతీష్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గట్టు సతీష్ మాట్లాడుతూ..గ్రామ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తానని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వాన్ని అనుసరిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజలనమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, వార్డు అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని ఆయన పేర్కొన్నారు. IMG-20251229-WA0072

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్న‌లిస్టుల‌కు ప్రభుత్వం అండగా ఉంటుంది జర్న‌లిస్టుల‌కు ప్రభుత్వం అండగా ఉంటుంది
_జీవో 252లో మార్పులు – ఇండ్ల స్థలాలకు కోర్టు అడ్డంకులు లేని విధానం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం హైదరాబాద్‌ , జనవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):...
కొండా గోపి పుట్టినరోజు సందర్భంగా నాగులవంచలో రక్తదాన శిబిరం..
శ్రీ గ్లోబల్ హై స్కూల్ నాగులవంచలో ఘనంగా సంక్రాంతి సంబరాలు..
పాత్రికేయ విలువలకు నిలువెత్తు ప్రతీక  టీ.కే. లక్ష్మణ రావు
మీ నమ్మకాన్ని వొమ్ము చేయడం లేదు
సింగరేణి విశ్రాంతి కార్మికులకు కనీస పెన్షన్ పెంచాలి
యాదవులు రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలి