ఘనంగా కాళోజి జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు.
Views: 4
On
హసన్ పర్తి,డిసెంబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు):
కాళోజి జూనియర్ కళాశాల 12వ వార్షికోత్సవ వేడుకలు రామారంలోని శ్రీ జగతి గార్డెన్స్ లో ప్రిన్సిపల్,సెక్రటరీ వై కే ఎస్, చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వైకేఎస్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు పిల్లలలో సృజనాత్మకత, క్రమశిక్షణ పెంపొందుతాయని విద్యార్థులు పట్టుదలతో విజయం సాధించి రాష్ట్ర అభివృద్ధి,దేశ అభివృద్ధికి పాల్పడాలని కోరారు.అలాగే చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ యువత తప్పుదోవ పట్టకుండా,చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రమశిక్షణతో మెలిగి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కే. తిరుపతిరెడ్డి,అనిల్ రెడ్డి, మధుకర్ రెడ్డి,సతీష్ కుమార్, అధ్యాపకులు,తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Jan 2026 20:10:09
వనపర్తి,జనవరి4(తెలంగాణ ముచ్చట్లు):
భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే సైన్స్ ఒక్కటే ప్రధాన ఆధారమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి...


Comments