సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడిగా కోలికపోగు సర్వేశ్వరరావు ఎన్నిక.!

సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడిగా కోలికపోగు సర్వేశ్వరరావు ఎన్నిక.!

సత్తుపల్లి, డిసెంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):

ఖమ్మం జిల్లా సిఐటియు 12వ మహాసభలు ఈ నెల 27, 28 తేదీల్లో ఖమ్మం పట్టణంలోని మంచికంటి భవన్‌లో ఘనంగా నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగిన మహాసభల అనంతరం నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సత్తుపల్లి పట్టణానికి చెందిన సిఐటియు నాయకులు కోలికపోగు సర్వేశ్వరరావును జిల్లా కమిటీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా కార్మికుల సమస్యలపై అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తూ అంచెలంచెలుగా ఎదిగిన కార్మిక నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. కార్మిక హక్కుల పరిరక్షణకే ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తూ పోరాడుతున్న నాయకుడిగా జిల్లా నాయకత్వం ఆయనను జిల్లా కమిటీలోకి ఎంపిక చేసింది.
ఈ ఎన్నిక పట్ల పలు ప్రజాసంఘాలు, సామాజిక సంఘాలు, పట్టణ ప్రముఖులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ కోలికపోగు సర్వేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కాజీపేట్ లో అట్టహాసంగా 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు ప్రారంభం కాజీపేట్ లో అట్టహాసంగా 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు ప్రారంభం
జాతీయస్థాయి సీనియర్ కోకో పోటీలను ప్రారంభిస్తున్న మంత్రులు అనంతరం మాట్లాడుతున్న ఉత్తంకుమార్ రెడ్డి ముఖ్య అతిధులు గా హాజరైన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,...
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
మృతుని కుటుంబానికి మేఘన్న ఆర్థిక చేయూత
షైన్ హై స్కూల్ సంక్రాంతి సంబరాలు...
సంక్రాంతి సందర్భంగా  ముగ్గుల పోటీలు
కందుకూరులో మంత్రి తుమ్మల పర్యటన.!
ముమ్మర ప్రచారం భారీ ఏర్పాట్లు