పామిరెడ్డిపల్లిలో మేకలు, గొర్రెలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమం

పామిరెడ్డిపల్లిలో మేకలు, గొర్రెలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమం

పెద్దమందడి,డిసెంబర్31(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామ రైతుల కోసం బుధవారం ఉదయం 8 గంటలకు గ్రామంలో మేకలు, గొర్రెలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రైతులు పెద్ద సంఖ్యలో వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా మండల పశువైద్యాధికారి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పశుసంవర్ధక సంక్షేమ పథకాలన్నింటిని రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం, మాజీ ఎంపీటీసీ ఇందిరా లక్ష్మారెడ్డి, రాజ మల్లయ్య, మండల పశువైద్యాధికారి కె. శ్యాము, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .