మణిగిళ్ల గ్రామంలో పోచమ్మ గుడి బాట రోడ్డు పనులకు శ్రీకారం

ఎన్నికల హామీని నెరవేర్చిన నూతన సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్

మణిగిళ్ల గ్రామంలో పోచమ్మ గుడి బాట రోడ్డు పనులకు శ్రీకారం

పెద్దమందడి,డిసెంబర్29(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం మణిగిళ్ల గ్రామ నూతన సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ ఆరాధ్య దేవత పోచమ్మ ఆలయానికి వెళ్లే బాట రోడ్డు పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. గ్రామ అభివృద్ధికి సంవత్సరాల తరబడి మరుగున పడి, అభివృద్ధికి నోచుకోని పోచమ్మ బాటకు నూతన రూపు కల్పించేందుకు ఈ పనులను చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని తొలి నిర్ణయంగా అమలు చేస్తూ, తన మొదటి మాటను నిలబెట్టుకున్న సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ నిర్ణయం గ్రామ ప్రజల్లో హర్షాతిరేకాలను కలిగించింది. గ్రామ ప్రజలతో పాటు భక్తులకు సౌకర్యంగా ఉండేలా చారిత్రక నిర్ణయం తీసుకున్నారని గ్రామస్థులు కొనియాడారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, భక్తులు సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.గ్రామాభివృద్ధికి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని సర్పంచ్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు సుంచార మోని రాములు, శేఖర్ గౌడ్, తిరుపతయ్య, రాజశేఖర్ సాగర్, వెంకటయ్య, బాలరాజు, కొములయ్య, నాగరాజు గౌడ్, బాబు రామకృష్ణారెడ్డి, ప్రతాపరెడ్డి, రామిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, ప్రేమ్ కుమార్ రెడ్డి, బీకే నాయుడు బాలాజీ, ఎర్ర తిరుపతి, బోడి గణేష్, బోయిన్ కృష్ణ, ఆనంద్ రెడ్డి, కావాలి శివ, శివకృష్ణ, జయలాలు, వడ్డే సూరి, మండల శివ, అంజి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్న‌లిస్టుల‌కు ప్రభుత్వం అండగా ఉంటుంది జర్న‌లిస్టుల‌కు ప్రభుత్వం అండగా ఉంటుంది
_జీవో 252లో మార్పులు – ఇండ్ల స్థలాలకు కోర్టు అడ్డంకులు లేని విధానం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం హైదరాబాద్‌ , జనవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):...
కొండా గోపి పుట్టినరోజు సందర్భంగా నాగులవంచలో రక్తదాన శిబిరం..
శ్రీ గ్లోబల్ హై స్కూల్ నాగులవంచలో ఘనంగా సంక్రాంతి సంబరాలు..
పాత్రికేయ విలువలకు నిలువెత్తు ప్రతీక  టీ.కే. లక్ష్మణ రావు
మీ నమ్మకాన్ని వొమ్ము చేయడం లేదు
సింగరేణి విశ్రాంతి కార్మికులకు కనీస పెన్షన్ పెంచాలి
యాదవులు రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలి