నూతన ఎస్సై జలంధర్ రెడ్డిని సన్మానించిన పెద్దమందడి ప్రెస్ క్లబ్
పెద్దమందడి,జనవరి21(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పెద్దమందడి పోలీస్ స్టేషన్‌కు నూతనంగా నియమితులైన ఎస్సై జలంధర్ రెడ్డిని ప్రెస్ క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. పెద్దమందడి మండలంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల సమస్యలపై సత్వర స్పందన అందించాలని కోరారు.ముఖ్యంగా అక్రమ కార్యకలాపాల నియంత్రణ, ట్రాఫిక్ నియమాల కఠిన అమలు, మహిళలు మరియు బాలల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.దీనికి స్పందించిన ఎస్సై జలంధర్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ శాఖ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో కీలకమని, మీడియా మరియు పోలీస్ శాఖల మధ్య సమన్వయం మరింత బలపడాలని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో పెద్దమందడి ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శులు, ప్రెస్ క్లబ్ సభ్యులతో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొని నూతన ఎస్సైకు శుభాకాంక్షలు తెలిపారు.


Comments