ఖమ్మం జిల్లా టీఎస్ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షునిగా హెచ్. వెంకటేశ్వరరావు.
సత్తుపల్లి, జనవరి 22 (తెలంగాణ ముచ్చట్లు):
టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న మాదిగ, జాతీయ ఉపాధ్యక్షులు లంక వెంకటేశ్వర్లు, ఎల్.వి.ఆర్ మాదిగల ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఖమ్మం జిల్లా టీఎస్ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షునిగా సత్తుపల్లి నియోజకవర్గం కాకర్లపల్లి గ్రామానికి చెందిన హెచ్. వెంకటేశ్వరరావును నియమించారు.
టీఎస్ ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో గత 28 సంవత్సరాలుగా చురుకైన పాత్ర పోషిస్తూ, ఎస్సీ వర్గీకరణ కోసం నిరంతరంగా పోరాటం చేస్తున్న నాయకుడిగా హెచ్. వెంకటేశ్వరరావుకు గుర్తింపు ఉంది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇచ్చిన ప్రతి కార్యచరణను ముందుండి నడిపిన వ్యక్తిగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల హక్కుల కోసం పోరాడిన నేతగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న, జాతీయ ఉపాధ్యక్షులు లంక వెంకటేశ్వర్లు, ఎల్.వి.ఆర్ మాదిగలు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అలాగే పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి మేళ్లచెరువు నాగేశ్వరరావు, సత్తుపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి హెచ్. హరీష్ మాదిగ, వేంసూరు మండల అధ్యక్షుడు మేకల వెంకటేశ్వర్లు, కల్లూరు మండల అధ్యక్షుడు వేల్పుల జానీ, ఖమ్మం జిల్లా నాయకులు పొట్టపింజర వెంకటరత్నం, ముదిగొండ మండల అధ్యక్షుడు కొత్తపల్లి నరసింహ, విద్యార్థి సంఘ జిల్లా అధ్యక్షుడు కర్ష ఉపేందర్, మహిళా మండలి జిల్లా అధ్యక్షురాలు మేళ్లచెరువు నాగమణి, చింతకాని మండల అధ్యక్షుడు సింగారపు బాబురావు తదితరులు హాజరై, ఖమ్మం జిల్లా కమిటీ తరపున హెచ్. వెంకటేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలియజేశారు.


Comments