మల్లాపూర్ ఇందిరమ్మ క్యాంటీన్‌లో టిఫిన్ సెక్షన్ ప్రారంభం
కేవలం ₹5కే టిఫిన్ : పేదల కోసం కాంగ్రెస్ మరో అడుగు
మల్లాపూర్, జనవరి 21 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మల్లాపూర్ ప్రాంతంలో ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్న ఇందిరమ్మ క్యాంటీన్‌లో టిఫిన్ సెక్షన్ ను ప్రారంభించారు. కాంగ్రెస్ ఉప్పల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు డివిజన్ కాంగ్రెస్ నాయకులు నెమలి అనిల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ టిఫిన్ సెక్షన్ ద్వారా పేద ప్రజలు, కూలీలు, కార్మికులు కేవలం ఐదు రూపాయలకే ఉదయపు టిఫిన్ పొందే అవకాశం కల్పించారు. ఇప్పటికే భోజన సౌకర్యం అందిస్తున్న క్యాంటీన్‌లో ఇప్పుడు టిఫిన్ విభాగం కూడా అందుబాటులోకి రావడంతో ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.ఈ సందర్భంగా నెమలి అనిల్ మాట్లాడుతూ,“ఇందిరమ్మ క్యాంటీన్ పథకం కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలిచే ఆలోచనకు నిదర్శనం. ఉదయం వేళల్లో కూడా తక్కువ ఖర్చుతో పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో టిఫిన్ సెక్షన్‌ను ప్రారంభించాం. ఇది పేదలకు ఎంతో ఉపయుక్తంగా మారుతుంది” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ తాండ్ర శ్రీకాంత్ రెడ్డి, శేఖర్ బాబు, పాషా తదితర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదలు, బడుగు వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని, భవిష్యత్తులో కూడా ప్రజాహిత కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతామని నాయకులు స్పష్టం చేశారు.


Comments