హిమాయత్‌నగర్‌లో మహవీర్ బ్యాంక్ 11వ శాఖ ప్రారంభం
హైదరాబాద్, జనవరి 20 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రముఖ సహకార బ్యాంకింగ్ సంస్థ మహవీర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తన సేవలను మరింత విస్తరించింది. నగరంలోని హిమాయత్‌నగర్‌లో బ్యాంక్ 11వ శాఖను సోమవారం ఘనంగా ప్రారంభించారు.ఈ నూతన శాఖను మోతీలాల్ జీ భాల్గట్ ప్రారంభించగా, ముఖ్య అతిథిగా కాంతీలాల్ నహర్ హాజరయ్యారు. కార్యక్రమంలో సుశీల్ కపాడియా, ఉదయ్ మోర్, హనుమాన్ దాస్ మాలు, బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు సభ్యులు, మేనేజ్‌మెంట్ ప్రతినిధులు, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బ్యాంక్ చైర్మన్ అశోక్ కొఠారి మాట్లాడుతూ, హిమాయత్‌నగర్ శాఖ ప్రారంభం మహవీర్ బ్యాంక్ విస్తరణలో కీలక మైలురాయిగా పేర్కొన్నారు.కస్టమర్ల నమ్మకం, పారదర్శకత, నాణ్యమైన సేవలే బ్యాంక్ పురోగతికి మూలస్తంభాలని తెలిపారు.భవిష్యత్తులోనూ ఇదే నిబద్ధతతో సేవలందిస్తామని హామీ ఇచ్చారు.సీనియర్ వైస్ చైర్మన్ హరినారాయణ్ వ్యాస్ మాట్లాడుతూ, ఈ నూతన శాఖ ద్వారా స్థానిక ప్రజలకు, ముఖ్యంగా వ్యాపారవర్గాలకు ఆధునిక బ్యాంకింగ్ సేవలు మరింత చేరువవుతాయని అన్నారు. ఇది ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కైలాస్, సోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.


Comments