కాప్రా నాచారం సర్కిల్స్‌లో శానిటేషన్, ఎంటమాలజీపై సమీక్ష

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: అడిషనల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

కాప్రా నాచారం సర్కిల్స్‌లో శానిటేషన్, ఎంటమాలజీపై సమీక్ష

కాప్రా, జనవరి 20 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజ్‌గిరి–ఉప్పల్, ఎల్బీనగర్ జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి కాప్రా, నాచారం సర్కిల్స్‌కు సంబంధించిన శానిటేషన్ మరియు ఎంటమాలజీ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా శానిటేషన్ విభాగానికి సంబంధించి ఇంటింటి చెత్త సేకరణ, వ్యాపార స్థలాల నుంచి చెత్త సేకరణ, స్వచ్ఛ ఆటోల పనితీరు మరియు పర్యవేక్షణ, గ్రీన్ వేస్ట్ లిఫ్టింగ్ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. చెత్త నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని అధికారులకు సూచించారు.అదేవిధంగా ఎంటమాలజీ విభాగం పనితీరును మరింత మెరుగుపరచాలని, సిబ్బంది నైపుణ్యాన్ని పెంచి ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. దోమల నివారణకు ఫాగింగ్ కార్యక్రమాన్ని సరైన షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని, ఆ వివరాలను ప్రజలకు ముందుగానే తెలియజేయాలని తెలిపారు.ఆయా విభాగాలకు సంబంధించిన విధులను చిత్తశుద్ధితో, బాధ్యతాయుతంగా నిర్వహించాలని అడిషనల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు ఆదేశించారు.ఈ సమావేశంలో కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీహరి, నాచారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నిత్యానంద్, డీఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ బాలకృష్ణ, రవి, ఏఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వెన్నెల, సానిటరీ సూపర్వైజర్ సుదర్శన్, ఏఈ ఎంటమాలజీ రమేష్, శానిటేషన్ విభాగ జవాన్లు, ఎస్‌ఎఫ్‌ఏలు, ఎంటమాలజీ విభాగ సూపర్వైజర్లు పాల్గొన్నారు.IMG-20260120-WA0066

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .