అమ్ముగూడ శ్మశానవాటిక అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం
యాప్రాల్, జనవరి 22 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాజిగిరి నియోజకవర్గం నేరేడ్మెట్ సర్కిల్ యాప్రాల్ పరిధిలోని అమ్ముగూడ శ్మశానవాటికలో సుమారు రూ.1.90 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ మరియు నేరేడ్‌మెట్ కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి వారి సహకారం, మార్గదర్శకత్వంతో విజయవంతంగా జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, శ్మశానవాటిక అభివృద్ధి ద్వారా సమాజానికి మెరుగైన మౌలిక వసతులు, గౌరవప్రదమైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని శ్మశానవాటికను సర్వసౌకర్యాలతో అభివృద్ధి చేయడం లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఆదిత్య, శ్మశానవాటిక అధ్యక్షుడు పరమేష్, పరస్ జైన్, పర్వతాలు, విష్ణు, రమణ్, శ్మశానవాటిక కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు మరియు జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Comments