తెలంగాణ ముచ్చట్లు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన తుమ్మల యుగంధర్
Views: 63
On
ఖమ్మం బ్యూరో,జనవరి 20 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ముచ్చట్లు దినపత్రిక క్యాలెండర్‌ను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో పత్రికల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ప్రజల సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకురావడంలో పత్రికలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తూ, సమకాలీన అంశాలపై స్పష్టతనిచ్చే విధంగా తెలంగాణ ముచ్చట్లు దినపత్రిక ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ముచ్చట్లు దినపత్రిక బ్యూరో చీఫ్ మదార్ సాహెబ్, కాంగ్రెస్ జిల్లా నాయకులు ఆసిఫ్, రిపోర్టర్ నజీర్ , రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
23 Jan 2026 19:40:38
అశ్వారావుపేట, జనవరి 23 (తెలంగాణ ముచ్చట్లు):
దమ్మపేట బస్టాండ్ ఆవరణలో పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని చేపట్టాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హైకోర్టును ఆశ్రయించి...


Comments