ఈస్ట్ గాంధీనగర్ కాలనీ నూతన కార్యవర్గం మర్యాదపూర్వక భేటీ
నాగారం, జనవరి 21 (తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ సర్కిల్ నాగారం డివిజన్ పరిధిలో ఈస్ట్ గాంధీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం కాలనీ అధ్యక్షులు గౌరక్క సత్యం సాగర్ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి నాగారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డిను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి, మౌలిక సదుపాయాల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కాలనీవాసుల సమస్యల పరిష్కారానికి తమ పూర్తి సహకారం అందిస్తామని ముప్పు శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాలనీ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ రెడ్డి, కోశాధికారి నక్క నవీన్ సాగర్, కార్యవర్గ సభ్యులు రేసు భూపతి, మాజీ కో-ఆప్షన్ సభ్యులు ఆడం షఫీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గణపురం కొండల్ రెడ్డి, కోడిమల కొండల్ రెడ్డితో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.


Comments