రామాలయంలో ఘనంగా తొమ్మిదవ వార్షికోత్సవం
ఖమ్మం బ్యూరో, జనవరి 22 (తెలంగాణ ముచ్చట్లు)
ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగిలిగొండ గ్రామంలో శ్రీశ్రీశ్రీ సీతారామచంద్రస్వామి 9వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ చైర్మన్ పదిమల వెంకట నరసయ్య, వైస్ చైర్మన్ గడ్డం రామారావు, గ్రామ పెద్దలు మాట్లాడుతూ సీతారామచంద్రస్వామి దేవాలయం ఎనిమిదవ సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఘనంగా వార్షికోత్సవం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించామని వారు తెలిపారు. ఉదయం 6 గంటలకు మంగళ వాయిద్యాలతో పుష్ప అలంకరణ కార్యక్రమాలు చేశారు. ఉదయం ఏడు గంటల 30 నిమిషాలకు స్వామివారికి పాల అభిషేకాలు చేశారు. ఉదయం 9 గంటలకు శిఖర చక్రస్థానం అభిషేకం, గుడి పైన అభిషేకం చేశారు. 11 గంటలకు హోమం తదనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు భక్తులు 2000 మంది తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ మండలి, ఆలయ అర్చకులు.. గ్రామ పెద్దలు , గ్రామ ప్రజలు, భక్త మహాశయులు తదితరులు పాల్గొన్నారు


Comments