బైరీ నవీన్ గౌడ్ జన్మదిన వేడుకలు లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
Views: 73
On
కాప్రా , జనవరి 22 (తెలంగాణ ముచ్చట్లు):
బీఆర్‌ఎస్ పార్టీ కాప్రా డివిజన్ అధ్యక్షుడు బైరీ నవీన్ గౌడ్ జన్మదిన వేడుకలు మల్లారెడ్డి గార్డెన్, ఎల్లారెడ్డి గూడలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి బైరీ నవీన్ గౌడ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు ఆయన అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, ప్రజల మన్ననలు పొందే నాయకుడిగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన వేడుకలను ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
23 Jan 2026 19:40:38
అశ్వారావుపేట, జనవరి 23 (తెలంగాణ ముచ్చట్లు):
దమ్మపేట బస్టాండ్ ఆవరణలో పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని చేపట్టాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హైకోర్టును ఆశ్రయించి...


Comments