బైరి నవీన్ గౌడ్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం
150 మందికి పైగా రక్తదానం చేసిన యువత
కాప్రా, జనవరి 20 (తెలంగాణ ముచ్చట్లు)
బైరి నవీన్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కాప్రా డివిజన్ పరిధిలోని ఎల్లరెడ్డిగూడలో మంగళవారం టీమ్ బీఎల్‌ఆర్ & బీఎన్‌జీ యువసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరాన్ని ముడిగొండ కాశీనాథ్ సమన్వయంతో ఏర్పాటు చేయగా, యువతతో పాటు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ శిబిరంలో 150 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా భావాన్ని చాటుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన రోగులకు ఈ రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. రక్తదానం ద్వారా ఒకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుందని పేర్కొంటూ, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో యువత చురుకుగా పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించడంలో టీమ్ బీఎల్‌ఆర్ & బీఎన్‌జీ యువసేన సభ్యులు కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు అబ్దుల్ గాఫుర్, స్నేహ, వెంకట్, రేణుక తదితరులు పాల్గొని వైద్య సేవలు అందించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు రక్తదాతలను అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలునిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. 


Comments