ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం
నెమలి అనిల్ కుమార్
మల్లాపూర్, జనవరి 22 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మల్లాపూర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ కాలనీలో నెలకొన్న తాగునీరు, డ్రైనేజ్ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బస్తీబాట కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ఏఈ సిరాజ్‌తో కలిసి కాలనీలో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు నెమలి అనిల్ కుమార్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా గ్రేటర్ కాంగ్రెస్ నాయకులు నెమలి అనిల్ కుమార్ మాట్లాడుతూ,“బస్తీల్లో నివసించే ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటికి శాశ్వత పరిష్కారాలు తీసుకురావడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు వినడం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, పరిష్కారం వచ్చే వరకు నిరంతరంగా అనుసరణ చేయడమే బస్తీబాట కార్యక్రమం ప్రధాన ఉద్దేశం” అని తెలిపారు.
అన్నపూర్ణ కాలనీలో తాగునీటి సరఫరాలో లోపాలు, డ్రైనేజ్ సమస్యలపై స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చారని, వాటి పరిష్కారానికి అధికారులతో సమన్వయం చేస్తూ త్వరితగతిన చర్యలు చేపట్టేలా కృషి చేస్తానని నెమలి అనిల్ కుమార్ భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ తండ్రా శ్రీకాంత్ రెడ్డి, కాలనీ అధ్యక్షులు శేఖర్ బాబు, భాను చంద్ర రెడ్డి, పాషా, ముబీన్, ప్రసాద్,హరీష్‌తో పాటు పెద్ద సంఖ్యలో కాలనీ ప్రజలు పాల్గొన్నారు.


Comments