మల్లాపూర్ పారిశ్రామిక ప్రాంత ప్రజల భద్రతకు కీలక అడుగు నెమలి అనిల్ కుమార్
మల్లాపూర్, జనవరి 22 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మల్లాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో మాణిక్చంద్ రోడ్ నుంచి నాచారం రోడ్ వరకు సరైన వీధి దీపాలు లేకపోవడం వల్ల కార్మికులు, ఉద్యోగులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు నెమలి అనిల్ కుమార్ తెలిపారు.ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో గ్రేటర్ కాంగ్రెస్ నాయకులు నెమలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఐఎఎల్ఏ కమిషనర్ ఏ. ప్రభాకర్‌ను, ఐఎఎల్ఏ మేనేజర్ విజయ్ కుమార్‌ను కలిసి కొత్త వీధి దీపాల ఏర్పాటు కోసం అధికారిక రిప్రెజెంటేషన్ అందజేశారు.ఈ సందర్భంగా మాణిక్చంద్ రోడ్ – శాహీ ఎక్స్‌పోర్ట్స్ – రహేజా విస్టాస్ – నాచారం ఎక్స్ రోడ్స్ వరకు సరైన లైటింగ్ లేకపోవడం వల్ల రాత్రి వేళ ప్రమాదాలు పెరుగుతున్నాయని, భద్రతా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కార్మికుల భద్రత, ప్రజల రక్షణతో పాటు పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి దృష్ట్యా తక్షణమే వీధి దీపాల ఏర్పాటు చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ వుండం శ్రీనివాస్‌తో పాటు ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొని పూర్తి మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా నెమలి అనిల్ కుమార్ మాట్లాడుతూ,“ప్రజల సమస్యలపై కేవలం మాటలకే పరిమితం కాకుండా
, అధికారుల వద్దకు తీసుకెళ్లి పరిష్కారం వచ్చే వరకు పోరాటం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. మల్లాపూర్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుంది” అని అన్నారు.


Comments