నితిన్ నబిన్ సారథ్యంలో బీజేపీకి నవశకం..
ఖమ్మంలో అంబరాన్నంటిన సంబరాలు..
దేశహితమే ధ్యేయంగా పార్టీ బలోపేతం...
బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు
ఖమ్మం బ్యూరో, జనవరి 20(తెలంగాణ ముచ్చట్లు)
భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షులుగా నితిన్ నబిన్ బాధ్యతలు స్వీకరించడంతో ఖమ్మం జిల్లా బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. ఈ శుభపరిణామాన్ని పురస్కరించుకుని మంగళవారం నాడు ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని, టపాకాయలు కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో పార్టీ పగ్గాలను నితిన్ నబిన్ చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కార్యాలయం మారుమోగేలా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ నితిన్ నబిన్ నియామకం పార్టీకి కొత్త శక్తిని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో, నితిన్ నబిన్ సారథ్యంలో బీజేపీ దేశవ్యాప్తంగా సరికొత్త శిఖరాలను అధిరోహిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ అధికారమే కాకుండా దేశహితమే ప్రధాన ధ్యేయంగా బీజేపీ పనిచేస్తోందని, నూతన అధ్యక్షుల నేతృత్వంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు తామంతా కృషి చేస్తామని తెలిపారు. ఖమ్మం జిల్లా పార్టీ పక్షాన నితిన్ నబిన్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు సీనియర్ నాయకులు, వివిధ మోర్చాల బాధ్యులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సంబరాల్లో పాలుపంచుకున్నారు.
ఖమ్మం జిల్లా ప్రబారి భర్త మహిపాల్ రెడ్డి ,
ఏదో డివిజన్ కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ వేరెల్లి రాజేష్ రవి రాథోడ్, నగరికంటి వీరభద్రం సుబ్బారావు , శ్రీకృష్ణ రవి గౌడ్ బోయల వెంకట్, మనీ తదితరులు పాల్గొన్నారు.


Comments