బండాచెరువు వాకర్స్ పార్క్ అభివృద్ధి పనులకు శ్రీకారం
వినాయక్‌నగర్, జనవరి 20 (తెలంగాణ ముచ్చట్లు):
బండాచెరువు వాకర్స్ పార్కులో రూ.16 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు వినాయక్‌నగర్ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి శుభారంభం చేశారు.ఈ అభివృద్ధి పనుల్లో పార్కులో ర్యాంప్ నిర్మాణం, మెట్లు, చెరువులోకి దిగేందుకు ప్రత్యేక మెట్లు, పార్కింగ్ స్థలం ఏర్పాటు, ఆర్చ్ నిర్మాణంతో పాటు ఇతర సౌకర్యాల అభివృద్ధి ఉన్నాయి. ఈ పనులు పూర్తయ్యే సరికి వాకర్లకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడనుందని కార్పొరేటర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో లాల్వాని నగర్ కాలనీ అధ్యక్షుడు నరేష్, అసోసియేషన్ సభ్యులు ప్రేమ్ కుమార్, గోపాల్ యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు ఆనంద్ గౌళికర్, ఓం ప్రకాష్, సంతోష్, బీజేపీ నాయకులు జగదీష్ చారి, సాయి సురేష్, గోపాల్, ఉమా కాంత్ పాల్గొన్నారు.అలాగే ఇంజినీరింగ్ విభాగం ఏఈ నవీన్ కుమార్, సూపర్‌వైజర్లు సాగర్, వెంకటేష్, హార్టికల్చర్ సూపర్‌వైజర్ వెంకటేష్ హాజరై పనుల వివరాలను పరిశీలించారు.స్థానిక ప్రజలు ఈ అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేసి పార్కును మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని కోరారు.


Comments