భూగర్భ డ్రైనేజీ,అన్నపూర్ణ కాలనీలో స్మశాన వాటిక అభివృద్ధి పనులు ప్రారంభం
నాచారం, జనవరి 22 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం నాచారం ప్రాంతంలో రూ.11.55 లక్షల వ్యయంతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , స్థానిక కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ తో కలిసి ప్రారంభించారు. ఈ డ్రైనేజీ పనుల ద్వారా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని తెలిపారు.అనంతరం అన్నపూర్ణ కాలనీలోని బుడగ జంగాల స్మశాన వాటికలో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శుభారంభం చేశారు. ఈ పనుల ద్వారా స్మశాన వాటికలో మౌలిక వసతులు మరింత మెరుగుపడి, ప్రజలకు సౌకర్యవంతంగా మారనున్నాయని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ లక్ష్యం ప్రతి కాలనీలో అవసరమైన మౌలిక వసతులను కల్పించడం అని, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులను వేగవంతంగా చేపడుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ కాలనీల ప్రతినిధులు, బుడగ జంగాల అసోసియేషన్ సభ్యులు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Comments