తెలంగాణ ముచ్చట్లు క్యాలెండర్ ఆవిష్కరించిన డాక్టర్ భరత్ బాబు
ఖమ్మం బ్యూరో, జనవరి 20 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రజా సమస్యలకు ప్రతిబింబంగా నిలుస్తున్న తెలంగాణ ముచ్చట్లు దినపత్రిక క్యాలెండర్–2026ను ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యంగ్ అండ్ డైనమిక్ డాక్టర్ కేసోజు భరత్ బాబు (ఎండి జనరల్ మెడిసిన్) ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే వార్తలు, సమకాలీన అంశాలతో పత్రిక ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకురావడంలో పత్రిక పాత్ర అభినందనీయమని పేర్కొన్నారు.
గ్రామీణాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. తెలంగాణ ముచ్చట్లు పత్రిక మరింత ప్రజాదరణ పొందాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ చింతపల్లి రాజ్ కుమార్, ప్రశాంతి హాస్పిటల్ మేనేజర్ మధు, డాక్టర్ ఇమామ్, తెలంగాణ ముచ్చట్లు ఖమ్మం బ్యూరో మదార్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.


Comments