పెనుబల్లిలో సంక్షేమ చెక్కుల పంపిణీ.
సత్తుపల్లి, జనవరి 22 (తెలంగాణ ముచ్చట్లు):
పెనుబల్లి మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన చెక్కులను సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మట్టా రాగమయి లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా మండలంలో మొత్తం 38 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు రూ. 11 లక్షల 51 వేల 500 విలువతో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అలాగే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మొత్తం 101 చెక్కులు అందజేశారు.
ఈ చెక్కుల ద్వారా ఎస్సీ: 25 మంది, బీసీ: 62 మంది, బీసీఈ: 1 మంది, ఈబీసీ: 13 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందగా, మొత్తం చెక్కుల విలువ కోటి రూపాయలకు పైగా ఉన్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.


Comments