పీచరలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల పేర్లను సూచించిన గ్రామ కమిటీ
Views: 49
On
వేలేరు, 27 నవంబర్ (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మంతపురి రాజు ఆధ్వర్యంలో గ్రామ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ తరఫున సర్పంచ్ పదవికి నలుగురు ఆశావాహుల పేర్లను కమిటీ తుది జాబితాగా సూచించింది.
సూచించిన అభ్యర్థులు:
జల్తారి రేణుక (W/o శ్రీనివాస్)
జల్తారి అనిత (W/o సంపత్)
రఘునాయకుల కవిత w/oశ్రీధర్ రెడ్డి
పల్లపు కృష్ణవేణి (W/o రాజు)
ఈ పేర్లను అధికారికంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి కమిటీ తరఫున పంపిణీ చేశారు.
కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదే కార్యక్రమంలో యువత ఉప్పుల శ్రీధర్, సట్ల సాయి కృష్ణ, కుండ్ర రాజిరెడ్డి, ఏడపెల్లి ప్రశాంత్ గారు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments