ఖమ్మం మానస కాంప్లెక్స్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీ ఆవిర్భావం.
మాచర్ల తిరుమలరావు.
ఖమ్మం బ్యూరో,నవంబర్28, తెలంగాణ ముచ్చట్లు:
ఖమ్మం మానస కాంప్లెక్స్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీ ఆవిర్భావం సందర్భంగా అధ్యక్షులు మాచర్ల తిరుమలరావు, మాట్లాడుతూ,పెయింటింగ్ యూనియన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే శుభ దినం నేడు, సభ్యుల ఆశీర్వాదాలతో, అత్యంత విశ్వాసంతో మా ఏడుగురిని ఎన్నుకోవడం మాకు లభించిన గొప్ప గౌరవం. మా మీద విశ్వాసం ఉంచిన ప్రతి సభ్యునికి పేరు పేరు న హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.
నేడు జరిగిన కార్యక్రమం మన పెయింటింగ్ యూనియన్ శక్తి, ఏకత, ఐక్యతకి ప్రతీకగా నిలిచింది. ఈ కార్యక్రమం సందర్భంగా సభ్యులందరూ భారీగా హాజరై, ఉత్సాహపూర్వకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహించిన భవ్యమైన బైక్ ర్యాలీ, మన యూనియన్ శక్తి, ఉత్సాహం, సంకల్పాన్ని ప్రతిబింబించింది. బైకులతో తాండవించిన ఈ ర్యాలీ ప్రజల దృష్టిని ఆకర్షించి, మన సంఘం శక్తివంతమైన ఐక్యతను ఖమ్మం జిల్లాకు చాటిచెప్పింది.
మమల్ని సభ్యులు, అభిమానులు, పెద్దలు ప్రేమతో, ఆదరాభిమానంతో చేసిన పాలాభిషేకాలు, కార్యక్రమాన్ని మరింత వైభవంగా మార్చాయి. ఆ క్షణాలు మా జీవితంలో మరచిపోలేని చారిత్రాత్మక క్షణాలుగా నిలిచిపోతాయి. ఈ ప్రేమాభిషేకాన్ని మేము కేవలం గౌరవంగా మాత్రమే కాకుండా ఒక బాధ్యతగా, ఒక ధర్మంగా భావిస్తున్నాము. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయం మన ఖమ్మం మానస కాంప్లెక్స్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ కు లభించిన కొత్త రిజిస్ట్రేషన్ నెంబర్ ఎ/319/ డి.వై.సి.ఎల్- ఖమ్మం/2025 మన ప్రయాణంలో ఒక స్వర్ణాక్షర ఘట్టం.
ఈ రిజిస్ట్రేషన్ నంబర్ మన పెయింటింగ్ యూనియన్ కు చట్టబద్ధత, ఆధికారికత, విశ్వసనీయత అనే మూడు, బలమైన స్తంభాలను ఇచ్చింది. ఈ నెంబర్‌తో మన అన్ని సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు మరింత పారదర్శకంగా మరియు సమర్థవంతంగా అమలవుతాయి. ఇది మన పెయింటింగ్ సంఘనికి ఒక కొత్త వెలుగు, కొత్త దీప్తి, కొత్త భవిష్యత్ దిశ. బాబురావు పెట్రోల్ బంక్ దగ్గర నుండి జడ్పీ సెంటర్ వరకు బైక్ ర్యాలీతో జై పెయింటర్ జై జై పెయింటర్ అంటూ, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, పెయింటర్ల ఐక్యత వర్ధిల్లాలి అని, భారీగా నినాదాలు ఇస్తూ, జెడ్పి లో గల అంబేద్కర్ విగ్రహానికి, పెద్ద పూలదండ వేయడం జరిగింది. మేము సాధించుకున్న రిజిస్ట్రేషన్ నెంబర్ ను ఎంతో ఆనందంగా బాంబులు కాలుస్తూ, కార్యక్రమానికి హాజరైన సభ్యులందరికీ తెలియజేయడం జరిగింది.
ఈ రోజు జరిగిన కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకం చేసిన అంశం సభ్యుల ఐక్యత. యువత నుంచి పెద్దల వరకు, అందరూ ఒకే తాటిపై నిలబడి, కార్యక్రమాన్ని ఘనవంతం చేయడం మన ఖమ్మం మానస కాంప్లెక్స్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ బలం ఎంత గొప్పదో మరోసారి నిరూపించింది..ప్రతి చిరునవ్వు, ప్రతి జైకొట్టు,
ప్రతి పువ్వు, ప్రతి అభినందన మన సంఘం శక్తికి ప్రతీక. అధ్యక్షుడి బాధ్యతగా, నేను చేసే ప్రతి పని సభ్యుల అభ్యున్నతికే అంకితం. మొదటగా నా కార్యచరణలో భాగంగా,
1)సభ్యుల సమస్యల పరిష్కారం. 2)సేవా కార్యక్రమాల విస్తరణ.
3)మన పెయింటింగ్ యూనియన్ కు ఉపయోగపడే కార్యక్రమాలు. చేపట్టడం ఇవన్నీ మా కార్యాచరణలో ముఖ్య ప్రాధాన్యత పొందనున్నాయి.
ఈరోజు జరిగిన భవ్య కార్యక్రమం మన పెయింటింగ్ యూనియన్ కు కొత్త శక్తిని, మాకు కొత్త బాధ్యతను, మా ప్రయాణానికి కొత్త దిశను ఇచ్చింది. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, నిబద్ధతతో, నిస్వార్థ సేవతో, ప్రకాశవంతమైన భవిష్యత్తు వైపు ముందుకు నడిపిస్తామని మేము హామీ ఇస్తున్నాము. మనందరం కలిసి సంఘ బలం, సేవ ధర్మం, అభివృద్ధే లక్ష్యం అనే సంకల్పంతో ముందుకు సాగుదాం. ఖమ్మం మానస కాంప్లెక్స్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీ సభ్యులుగా,
గుంజులూరి వెంకటేశ్వర్లు
గౌరవ అధ్యక్షులు, మాచర్ల తిరుమలరావు అధ్యక్షులు,
మేడబోయిన రమేష్
ఉపాధ్యక్షులు, మాలోత్ సురేష్
ప్రధాన కార్యదర్శి, కత్తుల శ్రీను
సహాయ కార్యదర్శి, వారగని రమేష్ కోశాధికారి. ఈ కార్యక్రమంలో పెద్దలు కోటపర్తి మాధవరావు, పూరండ్ల యాకయ్య, పేరాల రామచంద్రు, కలకోట వెంకటేశ్వర్లు, కుక్కల జోసెఫ్, కాలేపోగు వెంకట్రావు, షేక్ దస్తగిరి పాషా, నాగేశ్వరరావు లంజపెళ్లి క్రాంతి,
క్యాంప్ వెంకటేశ్వర్లు, దుబ్బాకుల కృష్ణ, కుక్కల స్వామి, మధు, యాకూబ్,
బాలకృష్ణ, వెంకటేశ్వర్లు, కృష్ణ, శ్రీకాంత్, బాబు శేఖర్, వీరేషం యూసుఫ్, అన్వర్, చంటి, పాషి, రాము,సాయి, షహేన్షా, దుర్గారావు పవన్ మరియు పెయింటింగ్ మేస్త్రిలు వర్కర్ సోదరులు పాల్గొన్నారు.


Comments