అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా 4వ వార్డులో ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రచారం
వనపర్తి,జనవరి31(తెలంగాణ ముచ్చట్లు):
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శనివారం వనపర్తి పట్టణం నాలుగో వార్డులో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మార్నింగ్ వాక్ చేపట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి శరవందకు మద్దతుగా వార్డులోని వీధుల గుండా పర్యటిస్తూ ప్రచారం చేపట్టారు.కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి శరవందను కౌన్సిలర్‌గా గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.నాలుగో వార్డులో శివాలయం అభివృద్ధి కోసం రూ.50 లక్షల రూపాయలు మంజూరు చేశామని, అలాగే బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.8 లక్షలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా రూ.85 లక్షలతో 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల తాగునీటి ట్యాంకును నిర్మించి తాగునీటి సమస్యను పరిష్కరించినట్లు పేర్కొన్నారు.ఇప్పటికే రూ.40 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని, మరో రూ.60 లక్షల రూపాయలతో త్వరలోనే సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వనపర్తి పట్టణం పూర్తిస్థాయిలో నిర్లక్ష్యానికి గురైందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్తు, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రైతులకు బోనస్, రైతు భరోసా, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని ఎమ్మెల్యే వివరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు చీర్ల విజయ్ చందర్, పార్టీ నాయకులు పరశురాములు, చంద్రశేఖర్ రెడ్డి, లక్కాకుల సతీష్, ఎస్‌ఎల్‌ఎన్ రమేష్, బ్రహ్మం చారి, పాకనాటి కృష్ణయ్య, ఎల్ఐసి కృష్ణ, బొంబాయి మన్నెంకొండతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments