మైనారిటీ సొసైటీల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రవేశ పరీక్ష కు దరఖాస్తుల ప్రారంభం
ఖమ్మం బ్యూరో, జనవరి 31(తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణ మైనారిటీ సొసైటీల సెంటర్ ఆఫ్ ఎక్సిలెన్స్ నందు ఐఐటీ, నీట్, క్లాట్ ప్రవేశాల కొరకు నిర్వహించే రాష్ట్ర వ్యాప్త ఎంట్రన్స్ పరీక్ష ఫిబ్రవరి 14న జరుగుతుంది అని ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 5వ తేదీ వరకు మైనారిటీ సొసైటీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ బాలికల కళాశాల ప్రిన్సిపల్ చుండు అఖిల ఒక ప్రకటనలో తెలియజేశారు. విద్యార్థులు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఖమ్మం మరియు కొత్తగూడెం విద్యార్ధినుల కొరకు ఖమ్మం రాపర్తి నగర్ నందు గల ఖమ్మం బాలికలు 1 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉచితంగా నాణ్యమైన బోధన, డిజిటల్ క్లాసులు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఐఐటి- జేఈఈ, ఎన్ఈఈటి కోచింగ్, వసతి మరియు భోజన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ప్రిన్సిపల్ చుండు అఖిల తెలిపారు.
మరిన్ని వివరాల కోసం రాపర్తి నగర్ కాలేజీ నందు గానీ 9154365017 నంబర్ నందు గానీ సంప్రదించి ఈ సువర్ణవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.


Comments