గ్రామీణ వైద్యుల శిక్షణను తిరిగి ప్రారంభించాలి
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దాడులను వెంటనే నిలిపివేయాలి
--- ప్రతి వెయ్యి మందికి ఒక గ్రామీణ వైద్యుడిని నియమించి గౌరవ వేతనం ఇవ్వాలి
--- తెలంగాణ మైనారిటీ గ్రామీణ వైద్యుల సంఘం 12వ మహాసభలో స్పర్శ సామాజిక అధ్యయన వేదిక అధ్యక్షులు కాకి భాస్కర్, ప్రముఖ సీనియర్ అడ్వకేట్, తెలంగాణ ఉద్యమ నేత మేకల సుగుణారావు
ఖమ్మం బ్యూరో, జనవరి 31 (తెలంగాణ ముచ్చట్లు) :
గ్రామీణ వైద్యులకు ప్యారా మెడికల్ బోర్డ్ ద్వారా మధ్యలో ఆగిన శిక్షణను తిరిగి ప్రారంభించాలని తెలంగాణ మైనారిటీ గ్రామీణ వైద్యుల సంఘం 12వ మహాసభలో స్పర్శ సామాజిక అధ్యయన వేదిక అధ్యక్షులు కాకి భాస్కర్, ప్రముఖ సీనియర్ అడ్వకేట్, తెలంగాణ ఉద్యమ నేత మేకల సుగుణారావు లు అన్నారు. తెలంగాణ మైనారిటీ గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ హసన్, జనరల్ సెక్రటరీ షేక్ జానిమియా ల అధ్యక్షతన సమావేశం జరిగింది. ఖమ్మం నగరంలోని టిటిడిసి కార్యాలయంలో శనివారం తెలంగాణ మైనారిటీ గ్రామీణ వైద్యుల సంఘం 12వ మహాసభ ఘనంగా జరిగింది. ఈ సభకు జిల్లా నలుమూలల నుండి మైనారిటీ గ్రామీణ వైద్యులు అధిక సంఖ్యలో పాల్గొని సభను ఉత్సాహభరితంగా నడిచేందుకు కృషి చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ హసన్, జనరల్ సెక్రటరీ షేక్ జానిమియా లు మాట్లాడుతూ... మైనార్టీ గ్రామీణ వైద్యుల సహకారంతో మైనార్టీలకు సంక్షేమ, అభివృద్ధి, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. కొత్త గ్రామీణ వైద్యులకు అవకాశం కల్పించాలని, శిక్షణ పూర్తి అయిన వారికి సర్టిఫికేట్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ వైద్యులకు శిక్షణ నిర్వహించడానికి ప్రభుత్వం వెంటనే బడ్జెట్ విడుదల చేయాలన్నారు. ఈ సందర్భంగా గ్రామీణ వైద్యులు ప్రధమ చికిత్స మాత్రమే చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు వైద్యరూపంలో సేవలందిస్తున్న గ్రామీణ వైద్యులకు ప్రభుత్వ పథకాలలో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని కోరారు. అదేవిధంగా గ్రామీణ వైద్యులకు చట్టభద్రత కల్పించి ప్రభుత్వ వైద్య పథకాలలో భాగస్వాములను చేయాలన్నారు. గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రతి వెయ్యి మందికి ఒక గ్రామీణ వైద్యుడిని నియమించి గౌరవ వేతనం ఇవ్వాలన్నారు. గ్రామీణ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దాడులను వెంటనే నిలిపివేయాలనీ,
గ్రామీణ వైద్యులపై పెట్టిన కేసులను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారు బేషరతుగా విరమించుకోవాలన్నారు. తెలంగాణ హెల్త్ మినిష్టర్ రాజనరసింహ ఇటీవల శాసన మండలిలో మాట్లాడుతూ.. గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇస్తామని హామీ ఇచ్చారని అదే మాటకు కట్టుబడి శిక్షణను ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. మైనార్టీ గ్రామీణ వైద్యులపై ప్రభుత్వం అక్రమంగా ఎటువంటి కేసులను నమోదు చేసినా ఉచితంగా న్యాయ సహాయం చేస్తానని ప్రముఖ అడ్వకేట్ మేకల సుగుణరావు హామీ ఇచ్చారు. అనంతరం కాకి భాస్కర్ ను శాలువతో సన్మానించారు. గ్రామీణ వైద్యులకు బహుమతులను అందజేశారు. ఈ సమావేశంలో నాయకులు జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్ హసన్, వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ నజీరుద్దిన్, జిల్లా కోశాధికారి షేక్ బాబుసాహెబ్, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ ఖాసీం, షేక్ చాంద్ పాషా, జిల్లా జాయింట్ సెక్రటరీ షేక్ ఆషా, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ మహ్మద్ సాహెబ్, ప్రచార కార్యదర్శులు షేక్ అమీర్, షేక్ జాని (శ్రీరాంగిరి), షేక్ ఇసాక్ పాషా, కార్యదర్శులు షేక్ అబ్దల్, షేక్ మస్తాన్ పాషా, షేక్ షాజహాన్, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు షేక్ మన్సూర్ అలి, షేక్ నబి, షేక్ రబ్బాని, షేక్ అలీ, యం.డి. మహిమూద్, షేక్ అహ్మద్ పాషా, షేక్ వలి, షేక్ 
నబి,షేక్ ఇమామ్, షేక్ మదర్ సాహెబ్,షేక్ నజీర్,షేక్ షరీఫ్,షేక్ బాజితో పాటు డివిజన్, మండల నాయకులు పాల్గొన్నారు.


Comments