ఖమ్మం జర్నలిస్టులకు కేటాయించిన భూమికి సుప్రీం కోర్టు తీర్పు వర్తించదు
మీడియా అకాడమీ చైర్మన్
ఖమ్మం బ్యూరో, జనవరి 20(తెలంగాణ ముచ్చట్లు)
ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం గత ప్రభుత్వం ప్రత్యేక జీవో, క్యాబినెట్ ఆమోదంతో కేటాయించిన 23.02 ఎకరాల భూమికి సుప్రీంకోర్టు తీర్పు వర్తించదని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. టిడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు టి. సంతోష్ చక్రవర్తి ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సమర్పించిన వినతిపత్రానికి స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఖమ్మం నగరంలోని స్థానిక ఎస్.ఆర్. గార్డెన్‌లో జర్నలిస్టుల బృందాన్ని కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య స్థానిక మంత్రుల స్థాయిలోనే పరిష్కారమయ్యే అంశమని, ఇందుకు తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు విలాసం కాదని, జీవన భద్రతకు సంబంధించిన మౌలిక అవసరమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు టి.ఎస్. చక్రవర్తి మాట్లాడుతూ, 23.02 ఎకరాల భూమిపై సుప్రీంకోర్టు తీర్పు వర్తిస్తుందన్న అయోమయం మీడియా అకాడమీ చైర్మన్ వ్యాఖ్యలతో పూర్తిగా తొలగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాలయాపన లేకుండా భూమిని జర్నలిస్టులకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నానబాల రామకృష్ణ, జిల్లా కోశాధికారి అర్వపల్లి నగేష్, (టీబీజేఏ) జిల్లా అధ్యక్షులు వందనపు సామ్రాట్ గుప్తా, వీడియో జర్నలిస్ట్ అధ్యక్షులు ఉపేందర్, జిల్లా సంయుక్త కార్యదర్శి కుంభం రవి కుమార్ , పట్టణ అధ్యక్షులు గేంటెల కుమార్, కార్యదర్శి నాయిని స్వాతి, ఎలెక్ట్రానిక్ మీడియా నగర అధ్యక్షుడు ఎలుగోటి వెంకట్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతోటి శ్రీనివాస్, కార్యదర్శి మల్లెల శిల్ప, సభ్యులు చిన్నంశెట్టి రాంబాబు, కరాటే వేణు, కొండలరావు, జగదీష్, మధు, కందరబోయిన నాగకృష్ణ,
శ్రీధర్, సొందుమియా, కిరణ్, పొదిలపు సంతోష్ కుమార్, రాకేష్, వేములకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments