మనిగిళ్ల గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
పెద్దమందడి,జనవరి28(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలో లబ్ధిదారులకు గ్రామ కంటెస్టెడ్ సర్పంచ్ అభ్యర్థి శివ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదేశాల మేరకు మనిగిళ్ల గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఈ. పద్మమ్మ (భర్త: ఈ. జగదీశ్వర్ రెడ్డి)కు రూ. 22,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు.పేద ప్రజలకు ప్రభుత్వ సహాయ పథకాలు నేరుగా అందేలా కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోందని నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Comments