ఎమ్మెల్యే మెగారెడ్డిని కలిసిన వెల్టూర్ వార్డు సభ్యురాలు మద్దూర్ స్వాతి
Views: 22
On
పెద్దమందడి,జనవరి16(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డిని వెల్టూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యురాలు మద్దూరు స్వాతి భర్త నరసింహతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, సమృద్ధి తీసుకురావాలని ఆకాంక్షిస్తూ, గ్రామస్థాయి నాయకుల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగంగా అమలు చేస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో , పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి పనిచేయాలని ఆయన మద్దూర్ స్వాతికి సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments