మద్దిగట్ల గ్రామంలో ముగ్గుల పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం

మద్దిగట్ల గ్రామ సర్పంచ్ మేకల రాములు

మద్దిగట్ల గ్రామంలో ముగ్గుల పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం

పెద్దమందడి,జనవరి16(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో పాల్గొని ప్రతిభ కనబరిచిన మహిళలకు బహుమతుల ప్రదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మద్దిగట్ల గ్రామ సర్పంచ్ మేకల రాములు ముఖ్య అతిథిగా హాజరై ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీలను విజయవంతం చేయడంలో భాగస్వాములైన మహిళలకు, నిర్వాహకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సాంస్కృతిక సంప్రదాయాలను కాపాడుతూ గ్రామ ఐక్యతను పెంపొందించిన ఈ ముగ్గుల పోటీలు భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగాలని గ్రామస్తులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .