పతంగులను పంపిణీ చేసిన కార్పొరేటర్ ప్రభుదాస్
కాప్రా, జనవరి 14 (తెలంగాణ ముచ్చట్లు):
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చిన్నారుల్లో ఆనందాన్ని నింపే ఉద్దేశంతో అన్నపూర్ణ కాలనీలో బీఆర్ఎస్ నాయకులు రిజ్వాన్ ఆధ్వర్యంలో పతంగుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక కార్పొరేటర్ జేరిపోతుల ప్రభుదాస్ చిన్న పిల్లలకు గులాబీ రంగు పతంగులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రభుదాస్ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగను చిన్నా–పెద్దా తేడా లేకుండా అందరూ సంతోషంగా జరుపుకోవడం ఆనందకరమన్నారు. పతంగులు ఎగరవేసే సమయంలో పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, భవనాలపైకి ఎక్కి పతంగులు ఎగరవేసేటప్పుడు విద్యుత్ తీగలను గమనించాలని సూచించారు. అలాగే చైనా మంజా వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు పాండాల నరసింహ గౌడ్, సెక్రటరీ సంజయ్ నాయక్, నాగి ముదిరాజ్, జావేద్, సాయి, అజీజ్, నవీన్ గౌడ్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Comments